Monday, January 20, 2020

Pongal - 2020

Akhil గాడి కళ్ళజోడులో కని (విని)పించిన పెళ్లి గోడు
శీతల పానీయం లో ఇంకో కోణం చూపిన Chetan Reddy
చెరుకు తో బెరుకు పోగట్ట ప్రయత్నించిన Teja
గుండు సూది లో కూడా ఇంత సోది  దాగుందా  అని అబ్బుర పరిచిన Kiran

శబరి, శబరి అంటూ "మంగమ్మ" ని ఆప్యాయంగా ఆట పట్టించే Sankara reddy
కొండలలో నెలకొన్న కోనేటి రాయుడిని తన కమ్మని స్వరం లో గుర్తు చేసింది  Madhuri వదిన
పట్టు వదలని విక్రమార్కుడు లా  అందరితో స్టెప్పులు వేయించిన Chandu babu
బిడియం కొంచం ఫిలిప్పీన్స్ లో  వదిలేసి మనకోసం డాన్స్ ఫ్లోర్ కి వచ్చిన Kavya

ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా అని Balu ని చూసి పాడుకున్న Sridhar బావ
ఎట్టికేలకు warm-up తో ఈ ఏడు dance లో అరంగేట్రం చేసిన Charitha  వదిన
మెడ నొప్పి అని డాన్స్ తప్పించుకుని, పది కోట్లు మాత్రం లెక్కేసుకున్న Krishna Reddy అన్న

ఆకాశం లో చుక్కలు ఎన్ని వున్నా, ఒక్కటే చందమామ,
డాన్సులు ఎన్ని వేసినా, 'రత్తాలు..రత్తాలు..' తో ఈ ఏడు హైలైట్ మాత్రం Koti మామ.
ముందు వచ్చిన కొమ్ముల కంటె వెనుక వచ్చిన చెవులు వాడి
Veeranjaneyulu మామయ్య  కి మనుమళ్ళ తోనే అంతా సందడి

మనకోసం ఓపిగ్గా రెండు సార్లు సొలస కి వచ్చిన Rajani అత్తయ్య
బెల్లం తో పాటు మిఠాయి లో కొంచం ప్రేమని దట్టించిన  Padma అత్తయ్య
బోర్డు మీద Nithin, చేతి మీద Alekya ల చిత్ర కళా నైపుణ్యం
మగాళ్లు భలే మాయగాళ్లు అని మళ్ళీ నిరూపించిన Dumb-C

ఆడండి ఆటలు, పెట్టండి పాటలు, వెయ్యండి స్టెప్పులు
అని ప్రోత్సహించిన Rama అత్తయ్య
ఘాటయిన చికెన్ ఫ్రై , ధీటు గా క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రై
వీడ్కోలు కి ముందే కళ్ళలో నీళ్లు తెప్పించిన మిర్చి బజ్జిలు

సైలెంట్ కిల్లర్ Sandeep, రాములో రాములో అంటూ Babloo సందడి
జ్వరం తో డీలా పడ్డా, బుడి బుడి నడకల తో Aarush హడావిడి 
ఈ ఏటికి మన ఫాషన్ డిజైనర్ Anjamma వదిన
బ్యాక్ గ్రౌండ్ లో Jaswanth, Babloo ల యెడ తెగని శ్రమ 

పప్పు గాడి తో కూడా లాభం ఉంటుంది అని నిరూపించిన Soujanya 
తానేమి తీసిపోనని ఇంకో Soujanya విప్పింది చంబా చిట్టా 
కంటి చూపు తో నే వంటల రుచి చెప్పే Koti అన్న
వెన్న లాంటి  మనసుతో ఇంటి కి పెద్ద కూతురిలా అన్నీ బాధ్యతలు మోసిన Padma వొదిన

Aruna అనే లైలా కోసం ఇంకా దేశమంతా తిరుగుతున్న మన మజ్ను Kesava
ఇష్టం లేని కూరలతో తినడానికి వీల్లేకుండా వంట బాగా చేస్తుంది
అని పొట్ట లో దాచుకున్న Malli గుట్టు విప్పిన AadiReddy అన్న

ఏటా  Seethamma  ఇంట్లో సంక్రాంతి సంబరాలు
కావాలి మన అందరి జీవితాల్లో మధుర క్షణాలు !!

No comments:

Post a Comment

Before the event..

Wednesday, 3d Jan, 11:00pm I just came back from 'flash mob' practice, which we intend to perform in the upcoming family day event i...