Tuesday, March 2, 2021

Maid blues (again....)

 పొద్దున్నే కొత్త  Maid వచ్చేస్తుంది అని

రాత్రే బట్టలు మడతెట్టిసి,

ఇల్లంతా సర్దేసి,

Dining Table సర్దేసి,

పొద్దునే లేచెసి,

Curry మిగిలిపోయింది  అని పిల్లలకి పూరి చేసేసి,

Chutney వుండిపొయింది అని ఆయనకి దొశెలు వేసేసి,

నేనేమో  పెరుగన్నం కలుపుకొని తినేసి,

లంచ్ కి Beans curry వండేసి,

కొంచం Tomato Chutney నూరేసి,

మధ్యలో కొంచం coffee సిప్పేసి,

Kitchenనుండి బయటపడేసరికి గడియారం పది కొట్టేసి,

హాడావిడి గా స్నానం కానిచ్చేసి,

దేవుడి కి కొంచం ధూపం వేసేసి,

Laptop ఓపెన్ చేసేసి,

కుప్పల తెప్పల emails చూసి గుటకేసి,

ఆ meeting, ఈ meeting కానిచ్చేసి,

నా పని లొకి దూకేసి,

మధ్యలో గడియారం వైపు, గుమ్మం వైపు ఓ లుక్కేసి,

పన్నెండు గంటలకు ఎదురుచూస్తున్న ఆ maid వచ్చేసి,

"అమ్మ, నాకు కుదరదు అని చెప్తే"


అప్పుడు కుడా  wild అవ్వకుండా ఎలా? ఎలా?

No comments:

Post a Comment

Before the event..

Wednesday, 3d Jan, 11:00pm I just came back from 'flash mob' practice, which we intend to perform in the upcoming family day event i...